హనుమకొండ సిటీ కాశీబుగ్గ, వెలుగు : హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన రెండు పులులను మంత్రులు, ప్రజాప్రతినిధులు శనివారం కాకతీయ జూ పార్కులో వదిలారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద జూ పార్కును హనుమకొండజిల్లాలోని దేవునూర్ గుట్టల్లో ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ జూ పార్కుకు సింహం, ఇతర వన్యమృగాలను తెచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఆమె రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణితో క్యురేటర్ ఆఫీస్ ను ప్రారంభించారు.
వరంగల్ చర్చిలో లిఫ్ట్ ప్రారంభం
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 18వ డివిజన్ పరిధిలోని క్రిస్టియన్ కాలనీలోని సీబీసీ చర్చిలో కొత్తగా ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ను శనివారం మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. కార్యక్రమంలో చర్చి పాస్టర్లు పూల్లా జగ్జీవన్ బాబ్జీ, మాథ్యస్, కార్తీక్ అబ్రహం, ప్రెసిండెంట్ పీఆర్ సాల్మన్, కార్పొరేటర్వస్కుల బాబు, కాంగ్రెస్ జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ కిన్నెర రవి
తదితరులున్నారు.