జమ్ముూకాశ్మీర్ లో ఉగ్రదాడి.. ఆరుగురు టూరిస్టులకు గాయాలు

జమ్ముూకాశ్మీర్ లో ఉగ్రదాడి.. ఆరుగురు టూరిస్టులకు గాయాలు

జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో  ఉగ్రవాదులు దాడులు చేశారు.మంగళవారం (ఏప్రిల్22) పహల్గామ్ పట్టణంలోని ఒక టూరిస్ట్ రిసార్ట్‌పై  టెర్రరిస్టుల జరిపిన దాడుల్లో ఆరుగురు టురిస్టులు గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న  ఆర్మీ, జమ్మూకాశ్మీర్ పోలీసులు టెర్రరిస్టులకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలను సేకరించడానికి ఆర్మీ అధికారులు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు ఉగ్రవాదులు ,భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగినట్లు ఎటువంటి సమాచారం లేదు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

దాదాపు 25 రోజుల పాటు కొనసాగిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ తర్వాత ఏప్రిల్ 14న భద్రతా దళాలు కిష్త్వార్ జిల్లాలోని ఛత్రు అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులకు చెందిన లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన ఉగ్రవాద స్థావరాన్ని ఆర్మీ కనుగొంది. పాకిస్థాన్ కు చెందిన జైష్ ఏ మొహ్మద్ (జేఎం) సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఉపయోగించే కమ్యూనికేషన్ ను గుర్తించారు.

►ALSO READ | పోలీసుల కండ్లుగప్పి సైబర్ నేరగాడు పరార్