
పంజాబ్ రాష్ట్రంలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పంజాబ్‌లో రెండు రైళ్లు ఢీ కొన్నాయి. పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్- ఢిల్లీ రైల్వే లైన్‌లోని ఫతేఘర్ సాహెబ్‌లో ఈరోజు తెల్లవారుజామున రెండు రైళ్లు ఢీకొట్టుకున్నాయి. అయితే.. ఈ ప్రమాదంలో కనీసం ఇద్దరు వ్యక్తులు గాయ పడ్డారని అధికారులు గుర్తించారు. గూడ్స్ రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. దీంతో గూడ్స్ ట్రైన్ ఇంజన్ ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.