
నర్సంపేట, వెలుగు : వారిద్దరు కవలలు.. ఇద్దరికీ ఒకే రోజు పెండ్లి జరిగింది. విచిత్రంగా ఒకేరోజు డెలివరీ కూడా అయ్యింది. ఇద్దరికీ కొడుకులే పుట్టారు. ఈ ఆసక్తికర సంఘటన వరంగల్జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేటలో జరిగింది. తిమ్మంపేట గ్రామానికి చెందిన బొంత సారయ్య, కొమురమ్మ దంపతులకు లలిత, రమ అనే ఇద్దరు కవలపిల్లలున్నారు. ఏడాది క్రితం వీరికి ఒకే రోజు పెండ్లి జరిగింది. లలితను రాయపర్తి మండలం కొలన్పల్లి కి చెందిన నాగరాజుకు, రమను తిమ్మంపేటకే చెందిన గొలన కుమార్కు ఇచ్చి పెండ్లి చేశారు. వీరిద్దరూ పురిటి నొప్పులతో గురువారం నర్సంపేట ఏరియా హాస్పిటల్లో జాయిన్అయ్యారు. ఇద్దరూ గురువారం రాత్రి మగ పిల్లలకు జన్మనిచ్చారు.