మహబూబాబాద్ జిల్లాలో బొట్టు పెట్టి, విభూతి చల్లి.. బంగారం చోరీ

మహబూబాబాద్ జిల్లాలో బొట్టు పెట్టి, విభూతి చల్లి.. బంగారం చోరీ
  • మహిళను బురిడీ కొట్టించిన దొంగలు
  • మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగరలో ఘటన

తొర్రూరు (పెద్దవంగర), వెలుగు: బాబా వేషధారణలో ఇంటికి వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళను బురిడీ కొట్టించారు. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం ఉప్పెరగూడెంకు చెందిన గంగాదరి శోభ తన పిల్లలతో కలిసి గతకొంత కాలంగా తల్లిగారి ఇంటి వద్దే ఉంటోంది. శుక్రవారం ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బాబా వేషధారణలో జాతకం చెబుతామని వచ్చారు.

ఆమెకు మాయమాటలు చెప్పి, బొట్టు పెట్టి, విభూతి చల్లారు. కాసేపటికి బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమె చెవి కమ్మలు, మాటీలు, ఇంట్లో కొంత నగదు దోచుకెళ్లినట్లు తెలిపారు. వీటి విలువ దాదాపు రూ.30 వేల వరకు ఉంటుందని బాధితురాలు శనివారం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.