అక్రమంగా గోవులను తరలిస్తున్న రెండు వాహనాలు సీజ్

నేరడిగొండ, వెలుగు : ఆవులు, లేగ దూడలను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని నేరడిగొండ ఎస్​ఐ శ్రీకాంత్ హెచ్చరించారు. మండలంలోని రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద గురువారం ఆయన వాహనాల తనిఖీలు చేపట్టగా మహారాష్ట్ర నుంచి నిజామాబాద్ వైపు అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న

రెండు వాహనాలను సీజ్​చేశారు. రెండు వాహనాల్లో కుక్కి తరలిస్తున్న 63 ఎద్దులను గుర్తించారు. ఎద్దులను ఇచ్చోడలోని గోశాలకు తరలించామని, వాహనదారులపై కేసు నమోదు చేసినట్లు ఎస్​ఐ తెలిపారు.