రైల్వే భద్రత, మౌలిక సదుపాయాల నిర్వహణలో ఉన్న సవాళ్లను ఎత్తిచూపుతూ ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా రైలు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో రైలు పట్టాలు తప్పింది. శుక్రవారం ఒడిశాలోని భువనేశ్వర్ రైల్వే స్టేషన్ కు సమీపంలో గూడ్స్ రైలులోని రెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటన ఉదయం 8.30 గంటల ప్రాంతంలో జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు.
కాగా ఈ ప్రమాదంలో ప్రాణనష్టం ఏం జరగలేదని.. ఎవరికి గాయాలు కూడా కాలేదని అధికారులు తెలిపారు. ఇతర రైళ్ల ప్రయాణానికి కూడా ఎలాంటి ఆటంకాలు లేవని స్పష్టం చేశారు. ప్రమాదానికి గురైన రైల్వే ట్రాక్ ను సహాయక బృందాలు పునరుద్ధరిస్తున్నయని అధికారులు వెల్లడించారు.
#WATCH | Odisha | Two wagons of a goods train derail near Bhubaneswar railway station; restoration work underway pic.twitter.com/ZDdNjUDE6l
— ANI (@ANI) July 26, 2024
#WATCH | Odisha | Two wagons of a goods train derail near Bhubaneswar railway station; restoration work underway pic.twitter.com/ZDdNjUDE6l
— ANI (@ANI) July 26, 2024