జగిత్యాలలో అందరు చూస్తుండగానే మంటల్లో కాలిపోయిన బైక్

జగిత్యాల జిల్లాలో బైక్  పూర్తిగా దగ్ధమయ్యింది.  బైక్ ఓ షాపు ముందు పార్క్ చేసిన బైక్ నుంచి  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బైక్ పూర్తిగా కాలిపోయింది. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కాలిపోయిన బైక్  పట్టణంలోని 28 వ వార్డు శ్రీ రామ్ నగర్ లో యూసుఫ్ అనే వ్యక్తికి చెందినదిగా గుర్తించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బైక్ కాలిపోవడానికి గల కారణాలపై ఆరాదీస్తున్నారు. పార్క్ చేసిన బైక్ నుంచి మంటలు చెలరేగడంతో ఎవరైనా ఆకతాయిలు చేశారా? లేక నిజంగానే ప్రమాదవ శాత్తు జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.