- కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ రిపోర్ట్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టూవీలర్ల అమ్మకాలు ఊపందుకుంటాయని కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. దేశీయంగా అమ్మకాలు పుంజుకుంటాయని, హై ఎండ్ మోటార్‌సైకిల్స్ డిమాండ్ బాగుంటుందని అంచనా వేసింది. కేర్‌ఎడ్జ్ రిపోర్ట్ ప్రకారం, కరోనా సంక్షోభం తర్వాత నుంచి టూవీలర్ అమ్మకాలు తగ్గుతున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రికవరీ అయ్యే ముందు అంటే 2019–20, 2020–21, 2021–22 లో టూవీలర్ అమ్మకాలు పడ్డాయి.
గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ ట్రెండ్ కొనసాగుతుంది. ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు పెరుగుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల్లో వడ్డీ రేట్లు తగ్గే చాన్స్ ఉండడంతో కూడా టూవీలర్ల సేల్స్ పెరిగే అవకాశం ఉందని కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ పేర్కొంది. కొత్త మోడల్స్‌కు డిమాండ్ పెరిగిందని, ఎగుమతులు కూడా పుంజుకుంటున్నాయని వెల్లడించింది.