
శంషాబాద్, వెలుగు: ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ ను ఎత్తుకెళ్లిన ఇద్దరు నిందితులను శంషాబాద్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. పాలమాకుల గ్రామానికి చెందిన అల్లం జగన్మోహన్ ఈ నెల 24న తన ఇంటి ముందు బైక్ పార్కు చేసి లోపలికి వెళ్లాడు. కొద్దిసేపటికి బయటకి వచ్చి చూడగా, బైక్ కనిపించకపోవడంతో 26న శంషాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో సీపీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బైక్ చోరీ చేసిన షాద్ నగర్ పట్టణంలోని చటాన్ పల్లికి చెందిన సభవత్ దేవ, మహబూబ్ నగర్ కు చెందిన మహ్మద్ సోహైల్‌ను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. నిందితుల నుంచి బైక్ రివకరీ చేశారు.