
టూ వీలర్ వాహనదారులకు అలర్ట్. హైదరాబాద్ లో రెండు రోజల పాటు కొన్ని ఫ్లై ఓవర్స్ పై నిషేధం విధించారు ట్రాఫిక్ పోలీసులు. షాబ్-ఇ-ఖాదిర్ (Shab-e-Qadr) సందర్భంగా ఫ్లై ఓవర్స్ పై నిషేధం అమలులో ఉంటుందని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మార్చి 27, 28న.. రెండు రోజుల పాటు బైక్ లకు పోలీసులు సూచించిన పలు ఫ్లై ఓవర్లపైకి అనుమతి లేదని గురువారం (మార్చి 27) ఒక ప్రకటన విడుదల చేశారు. రాత్రి 10 గంటల తర్వాత బైక్స్ ఈ ఫ్లై ఓవర్లు ఎక్కితే చర్యలు తప్పవని హెచ్చరించారు. షాబ్-ఇ-ఖాదిర్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు.
టూ వీలర్స్ నిషేధం అమలులో ఉండే ఫ్లై ఓవర్లు:
- బహదూర్ పుర ఫ్లై ఓవర్ - జూపార్క్ 2వ గేట్ నుంచి దేవీ బాఘ్ వరకు
- చంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ - హషామాబాద్ నయారా పెట్రోల్ బంక్ నుంచి ఫూల్ బాఘ్ DLRL వరకు
- డా.ఏపీజే అబ్దుల్ కలాం ఫ్లై ఓవర్ - పిసల్ బండ నుంచి లక్ష్మీరెడ్డి గార్డెన్స్ ఫంక్షన్ హాల్ వరకు
- డా.మన్మోహన్ సింగ్ ఎక్స్ ప్రెస్ ఫ్లై ఓవర్ - ఆరాంఘర్ నుంచి జూపార్క్ ఫ్లై ఓవర్ వరకు
Also Read : సైబర్ మోసాలు జరుగుతుంటే బ్యాంకులు ఏం చేస్తున్నాయి
హైదరాబాద్ టూ వీలర్ బైకర్స్ నిషేధాజ్ఞలను దృష్టిలో ఉంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఏదైనా అంతరాయం కలిగితే 9010203626 అనే నంబర్ కు ఫోన్ చేయాల్సిందిగా సూచించారు.
ఇటీవల ఇస్లామిక్ పండుగల సందర్భంగా ఫ్లై ఓవర్లపై యాక్సిడెంట్స్ ఎక్కువయ్యాయి. షాబ్-ఇ-మెరాజ్ సందర్భంగా మాజ్(14), ఇమ్రాన్(16), అహ్మద్(14) అనే మైనర్లు ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఘోర ప్రమాదాలకు గురయ్యారు.
ఈ సందర్భంగా తమ పిల్లలకు చర్యలపై పోలీసులు దృష్టి సారించాలని, ప్రేయర్ చేసుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చి వారిని స్టంట్స్ కు దూరంగా ఉండేలా చూడాలని పోలీసులను కోరారు కొందరు మత పెద్దలు.