న్యూయార్క్ వేదికగా అమెరికాపై జరుగుతున్న మ్యాచ్ లో భారత బౌలర్ అర్షదీప్ సింగ్ అరుదైన ఘనత అందుకున్నాడు. తొలి బంతికే వికెట్ తీసి భారత్ తరపున టీ20ల్లో ఈ ఫీట్ సాధించిన తొలి బౌలర్ గా రికార్డ్ సృష్టించాడు. ఇప్పటివరకు ఏ భారత బౌలర్ టీ20 క్రికెట్ తొలి బంతికి వికెట్ తీయకపోవడం విశేషం. అమెరికా బ్యాటర్ జహంగీర్ ను తొలి బంతికి ఎల్బీడబ్ల్యూ రూపంలో అవుట్ చేశాడు. ఇదే ఓవర్ చివరి బంతికి గౌస్ ను వెనక్కి పంపి అమెరికాను కష్టాల్లోకి నెట్టాడు.
భారత్ తరపున టెస్టుల్లో అబీడ్ అలీ 1971 లో వెస్టిండీస్ పై.. వన్డేల్లో మొహంతి 1999 లో వెస్టిండీస్ పై తొలి బంతికి వికెట్ తీసుకున్న తొలి బౌలర్ గా నిలిచారు. అర్షదీప్ కు తోడు భారత బౌలర్లు విజృంభించడంతో తొలి 10 ఓవర్లలో అమెరికా 3 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. అర్షదీప్ సింగ్ కు 2, సిరాజ్ కు ఒక వికెట్ దక్కింది. జహంగీర్(0), గౌస్(2), జోన్స్ (11) విఫలమయ్యారు.
No need to look at the umpire 🔥☝️You can now own iconic moments like this Arshdeep Singh wicket and start building your Super Team! 🏏#INDvsUSA pic.twitter.com/VnPIEsNUS2
— Hyder Ramzan (@HyderRamzaan) June 12, 2024