గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మహిళలు మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మహిళలు మృతి

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టలో ఘోరం జరిగింది. కరీంనగర్-వరంగల్ రహదారిపై గుర్తు తెలియని  వాహనం ఢీకొని  ఇద్దరు మహిళలు చనిపోయారు. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెబుతున్నారు స్థానికులు. మృతులు సులోచన, సుజాత సొంత అక్కా చెళ్లెళ్లు కాగా…. కొత్తగట్టుకు చెందిన తునికి కొమురయ్య అనే ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఉదయం 5 గంటల సమయంలో వ్యవసాయ పనుల కోసం పొలం దగ్గరకు వెళ్ళానని ఇంతలోనే వారు చనిపోయినట్లు ఫోన్ వచ్చిందని భర్త కొమురయ్య చెబుతున్నాడు. చనిపోయిన సులోచనకు ముగ్గురు కొడుకులు, సుజాతకు ఒక కొడుకు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు