మెదక్ (నర్సాపూర్), వెలుగు: కరెంట్ షాక్తో ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు. ఈ సంఘటన గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం గూడెంగడ్డ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన నర్సింలు అనే రైతు తన పొలంలో కలుపు తీసేందుకు అదే గ్రామానికి చెందిన ఐదుగురు మహిళలను కూలీకి తీసుకెళ్లాడు.
వారు పొలంలో కలుపు తీస్తున్న సమయంలో అనూహ్యంగా కరెంట్ వైర్లు తెగిపడటంతో ఆవంచ లక్ష్మీ(41), బీర్ల నవనీత(35) అనే ఇద్దరు మహిళలు కరెంట్ షాక్ కు గురై పొలంలోనే మృతి చెందారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. సంఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నర్సాపూర్ ఎస్సై గంగరాజు తెలిపారు.