ఇద్దరు లేడీ డాక్టర్ల పెళ్లి.. కారణం అదే

వాళ్లిద్దరు ఒకర్ని ఒకరు ఇష్టపడ్డారు. కలిసి బతకాలనుకుంటున్నారు. పెళ్లితో ఒక్కటవ్వాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. వారిద్దరూ అమ్మాయిలు. అదీ కూడా బాగా చదవి స్థిరపడ్డ డాక్టర్లు. అయితే వాళ్లిద్దరు కూడా కలిసి బతకాలని డిసైడ్ అయ్యారు. ఆ విషయం ఇంట్లో పెద్దవాళ్లకు కూడా చెప్పి ఒప్పించారు. ఈ అరుదైన ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... పరోమిత ముఖర్జి, సురభి మిత్ర.. ఇద్దరు డాక్టర్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరిలో కూడా చిన్నప్పుటి నుంచి లైంగికంగా ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. అయితే పరోమిత ముఖర్జి విషయంలో ఆమె లైంగిక ధోరణి గురించి ఆమె తండ్రికి తెలుసు. 2013 నుండి తన లైంగిక ధోరణి గురించి నాన్నకు తెలుసని పరోమిత తెలిపింది. ఇటీవల ఆ విషయం అమ్మకు చెప్పినప్పుడు, ఆమె షాక్ అయ్యిందని పేర్కొంది. కానీ తర్వాత ఆమె కూడా అంగీకరించింది. ఎందుకంటే తన తల్లి కూడా తాను సంతోషంగా ఉండాలనుకుంటున్నానని కోరుకుంటుందని చెప్పుకొచ్చింది. 

ఇక డాక్టర్ సురభి తన గురించి చెప్పుకొచ్చింది. తన లైంగిక ధోరణి గురించి తన కుటుంబం నుండి ఎప్పుడూ వ్యతిరేకత రాలేదని తెలిపింది. నిజానికి తన పేరెంట్స్ కి చెప్పినప్పుడు వాళ్ళు సంతోషించారని తెలిపింది సురభి. ఇక తాను సైకియాట్రిస్ట్‌ని.. చాలా మంది తమలో ఉన్న ఈ రెండు రకాల జీవితం గురించి తనతో మాట్లాడతారని పేర్కొంది. ఎందుకంటే అలాంటివాళ్లు.. తమంతట తాము సరైన నిర్ణయం తీసుకోలేరని సురభి మిత్ర చెప్పుకొచ్చింది. ఎవరేమనుకున్న ఈ లేడీ డాక్టర్ల జంట  ఒక్కటయ్యేందుకు సిద్ధమవుతోంది. త్వరలో గోవాలో వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసుకోనుంది. ఈ రిలేషిన్ షిప్ కు డాక్టర్ల జంట ‘లైఫ్ టైమ్ కమిట్ మెంట్’ అని చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి: 

భారత్ లో కరోనా కలకలం...50వేలకు పైగా కేసులు

కరోనా బారిన పడిన షిప్