కుంభమేళాలో ఇద్దరు మహిళలు మిస్సింగ్

కుంభమేళాలో ఇద్దరు మహిళలు మిస్సింగ్

కడెం, వెలుగు : నిర్మల్ జిల్లా కడెం మండలానికి చెందిన ఇద్దరు మహిళలు ఉత్తరప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​లో జరుగుతున్న కుంభమేళాలో తప్పిపోయారు. దీంతో వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. వారి వివరాల ప్రకారం.. కడెం మండలం పెద్ద బెల్లాల్ గ్రామపంచాయతీలోని ఉప్పరగూడెం గ్రామానికి చెందిన బెల్లపు సత్తవ్వ(55), కల్లెడ గ్రామానికి చెందిన అనుగుల బుచ్చవ్వ(65) జగిత్యాల జిల్లాకు చెందిన మరికొందరు బంధువులతో కలిసి కుంభమేళా యాత్రకు వెళ్లారు.

అయితే 29వ తేదీ నుంచి ఈ ఇద్దరితోపాటు వీరితో కలిసివెళ్లిన మరో ఇద్దరి ఆచూకీ లభించడం లేదు. పుణ్యస్నానాలు ముగించుకున్న తర్వాత నుంచి కనిపించడంలేదని సహ యాత్రికులు వెల్లడించారు. అక్కడి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసి యాత్రికుల  శిబిరాలలో వెతుకుతున్నామని చెప్పారు