ప్లాస్టిక్ కవర్లో పసిబిడ్డ.. అల్వాల్ ఆలయం ముందు వదిలేసిన ఇద్దరు మహిళలు

ప్లాస్టిక్ కవర్లో పసిబిడ్డ.. అల్వాల్ ఆలయం ముందు వదిలేసిన ఇద్దరు మహిళలు

అల్వాల్, వెలుగు: అప్పుడే పుట్టిన మగబిడ్డను ప్లాస్టిక్ కవర్​లో చుట్టి ఇద్దరు మహిళలు ఆలయం ముందు వదిలేసి వెళ్లారు. మేడ్చల్ జిల్లా అల్వాల్​వెంకటాపురం డివిజన్​లోని పోచమ్మ గుడి ముందు సోమవారం తెల్లవారుజామున శిశువు కేకలు విని అటుగా వెళ్తున్న స్థానికులు  పోలీసులకు సమాచారం అందించారు. 

వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పసికందును హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అయితే, ఇద్దరు మహిళలు శిశువును వదిలేసి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో వారు ఎవరన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.