నరదృష్టి పేరుతో మోసం .. ఇద్దరు మహిళల అరెస్ట్ 

నరదృష్టి పేరుతో మోసం .. ఇద్దరు మహిళల అరెస్ట్ 

పంజాగుట్ట, వెలుగు: నరదృష్టి పేరుతో నగదు కాజేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. బంజారాహిల్స్​లోని కరుణ అనే మహిళ ఇంటికి నిజామాబాద్​ జిల్లా తొర్లికొండకు చెందిన శారదకళ్ల కవిత (50), దుమ్మాయిగూడకు చెందిన మాధవి (40) కలిసి వెళ్లారు. తమకు నరదృష్టి ఉందని, అది పోవాలంటే రూ.లక్ష నగదు, నిమ్మకాయ, మిర్చి, సాల్ట్​, బియ్యం కావాలని అడిగారు. వాటిని చీరలో చుట్టి పూజలు చేయాలని నమ్మబలికారు. మరుసటి రోజు వాటిని తెరవాలని చెప్పి, పూజల అనంతరం వెళ్లిపోయారు. అనంతరం వాటిని తెరిచి చూస్తే రూ.70 వేల నగదు మాయమైంది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన బంజారాహిల్స్​పోలీసులు నిందితులను శుక్రవారం అరెస్ట్​  చేసి రిమాండ్​కు తరలించారు.