హైదరాబాద్ : GHMC అధికారుల నిర్లక్ష్యం ఇద్దరు కార్మికులను బలి తీసుకుంది. ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం పరిధిలోని సాహెబ్ నగర్ లో మ్యాన్ హోల్స్ క్లీన్ చేయడానికి దిగి ఇద్దరు కార్మికులు చనిపోయారు. రాత్రిపూట డ్రైనేజ్ క్లీన్ చేసేందుకు అనుమతి లేకున్నా.... కాంట్రాక్టర్ బలవంత పెట్టడంతో కార్మికులు డ్రైనేజీలో దిగారు. డ్రైనేజీలో ఊపిరి ఆడక శివ అనే కార్మికులు చనిపోయాడు. ఊబిలో చిక్కుకున్న శిను కాపాడేందుకు యత్నించిన అంతయ్య అనే మరో కార్మికుడు మృతి చెందాడు. ఫైర్ సిబ్బంది శివ డెడ్ బాడీని బయటకు తీశారు. అంతయ్య శవం ఇంకా దొరకలేదు. చనిపోయిన శివకు మూడేళ్ళ క్రితమే పెళ్లైంది. ప్రస్తుతం శివ భార్య 8 నెలల గర్భవతి. చనిపోయిన ఇద్దరు కార్మికులు సైదాబాద్ చింతల్ బస్తీకి చెందిన వారుగా గుర్తించారు.