ఒక్కపాట కోసం ఇద్దరు రైటర్స్.. గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ ఛాన్స్ ఎవరికీ?

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్(Trivikram) డైరెక్షన్ లో వస్తోన్న మూవీ గుంటూరు కారం(Gunturkaram). ఈ మూవీ నుంచి లీకులు సోషల్ మీడియాలో ఎలా హల్ చల్ చేస్తున్నాయో..ఫస్ట్ సింగిల్ అప్డేట్ విషయంలో కూడా అలానే వార్తలు వినిపిస్తున్నాయి. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..మ్యూజిక్ డైరెక్టర్ థమన్(SS Thaman) ఈ సినిమాలోని సాంగ్స్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టాడని టాక్. గతంలో త్రివిక్రమ్ అలా వైకుంఠ పురం, అరవింద సమేత మూవీస్ కి బ్లాక్ బస్టర్స్ సాంగ్స్ ఇచ్చిన థమన్..మరోసారి తనలోని డిఫరెంట్ యాంగిల్ను చూపించడానికి రెడీ అయ్యాడంట. 

గుంటూరు కారంలోని ఫస్ట్ సాంగ్..సినిమాకే హైలెట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇందుకోసం ఇద్దరు ఫేమస్ లిరిక్ రైటర్స్ చేత..రెండు వెర్షన్స్ లో మెలోడీ సాంగ్ను రాయిస్తున్నారట. వీటిని రెండు వెర్షన్ లో కంపోజ్ చేసి అందులో ఏది బాగుంటే, అది ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. రామ జోగయ్య శాస్ట్రీ(Ramajogayya Sastry), కాసర్ల శ్యామ్(Kasarla Shyam)లు ఈ ఫస్ట్ సింగిల్ మెలోడీ కోసం వర్క్ చేసినట్లు టాక్. ఈ సాంగ్ను ఫేమస్ సింగర్ అనురాగ్ కులకర్ణి రెండు వెర్షన్స్లో పాడి..త్రివిక్రమ్కు వినిపించినట్లు సమాచారం.

Also Read :- అలా చేయటంతో.. చాలా హర్ట్ అయ్యా.. : హీరో సిద్దార్థ్

ఈ సాంగ్ను దసరా ఫెస్టివల్ కంటే ముందే రిలీజ్ చేయబోతున్నట్లు..రీసెంట్గా ప్రొడ్యూసర్ నాగవంశీ(Nagavamshi) లీక్ చేశారు. మరి థమన్ ఇచ్చిన మెలోడీ ట్యూన్..ఆడియన్స్ను  ఏ విధంగా ఆకట్టుకుంటుందో మరి. అలాగే..మహేష్ అభిమానుల్లో థమన్ మ్యూజిక్ పైన కొన్ని అనుమానాలు ఉన్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. 

ఇటీవల కాలంలో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ ఇచ్చినా ట్యూన్స్ అంతగా క్లిక్ కావడం లేదు. ఆడియన్స్ లో ఏదో తెలియని చిరాకు కలిగిస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా అతను కిక్ ఇవ్వడం లేదు..రీసెంట్ గా రిలీజ్ అయిన స్కంద మూవీలో అదే జరిగింది. మ్యూజిక్ బీట్స్ అన్నీ రొటీన్ గానే కొడుతున్నాడని ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు. మరి త్రివిక్రమ్ ఏ విధమైన ట్యూన్స్ రాబడుతాడో చూడాలి మరి.