జగన్ ను టార్గెట్ చేసిన షర్మిల - వైసీపీ నుండి కాంగ్రెస్ లోకి వలసలు

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల జగన్ కు బ్యాక్ టు బ్యాక్ షాక్ ఇస్తున్నారు. పీసీసీ చీఫ్ గా ఏపీలో ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి జగన్ మీద వరుసగా విమర్శలు చేస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. జగన్ గద్దె దించటమే లక్ష్యంగా వేగంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో వైసీపీని నిర్వీర్యరం చేసేందుకు ప్లాన్ చేస్తోంది షర్మిల. వైసీపీకి బలమున్న జిల్లాల్లో ఒకటైన కర్నూలును టార్గెట్ చేసినాట్లు కనిపిస్తోంది. రెండు రోజుల్లో కర్నూలుకు చెందిన నందికొట్కూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్, కొడుమూరు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీ కృష్ణ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడమే ఇందుకు నిదర్శనం.

జగన్ టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూనే మరో పక్క కాంగ్రెస్ పార్టీని బలపరిచే దిశగా చర్యలు చేపట్టారు షర్మిల. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున నందికొట్కూరు నుండి పోటీ చేసి గెలుపొందిన ఆర్థర్, వచ్చే ఎన్నికల్లో సీటు దక్కకపోవడంతో వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. రెండు రోజుల వ్యవధిలోనే ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు పార్టీని వీడటం క్షేత్ర స్థాయిలో వైసీపీకి గట్టి దెబ్బ అనే చెప్పాలి. మరి, ఈ వరుస వలసలు కర్నూలు జిల్లా వైసీపీ మీద ప్రభావం చూపుతాయా లేదా, లేక ఏపీలో ఎప్పుడో కనుమరుగైన కాంగ్రెస్ పార్టీకి పునర్జన్మను ఇస్తాయా అన్నది వేచి చూడాలి.

ALSO READ :- IPL 2024: అతడికే బాధ్యతలు: కెప్టెన్‌ను ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్