నిజామాబాద్లో దారుణం..అనుమానాస్పద స్థితిలో రెండేళ్ళ చిన్నారి మృతి

నిజామాబాద్లో దారుణం..అనుమానాస్పద స్థితిలో రెండేళ్ళ చిన్నారి మృతి

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియిన రెండేళ్ల చిన్నారిని బండరాయితో మోది హత్య చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ కాలేజీ ముందు చెత్త కుప్పలో బాలుడి మృతదేహం లభ్యమైంది. రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్ బృందంతో తనిఖీలు చేపట్టారు. 

మృతిచెందిన బాలుడు మహారాష్ట్ర బిలోలికి చెందిన చౌహాన్ రాథేగా పోలీసులు గుర్తించారు. శుక్రవారం (మార్చి28) మధ్యాహ్నం నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో మిస్సయినట్లు తెలుస్తోంది. బండరాయితో దారుణంగా కొట్టి చంపినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. హత్య చేసిన తర్వాత ఉమెన్స్ కాలేజీ సమీపంలో పారేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.