తిరుపతి: రెండేళ్ల తర్వాత తిరుమల శ్రీవారి ఆలయ హుండీ ఆదాయం వంద కోట్లు దాటింది. మార్చి నెలలో హుండీ ద్వారా 128 కోట్ల 81 లక్షల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కారోనా కారణంగా రెండేళ్లలో టీటీడీ ఆదాయం భారీగా తగ్గింది. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడంతో మార్చి నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతొ రెండేళ్ల తర్వాత తిరుమల క్షేత్రం భక్తులతో సందడిగా మారింది. మార్చి నెలలో మొత్తం 19 లక్షల 72 వేల 656 మంది భక్తులు వెంటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
మరిన్ని వార్తల కోసం..
చూపులేని వారికోసం స్మార్ట్ సెన్సర్ షూ
4 నెలల వరకు వడ్డీ రేట్లు మారవా!