
తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లో తప్పిపోయిన రెండేళ్ల బాలుడు సురక్షితంగా పోలీసుల చెంతకు చేరాడు. చిన్నారిని స్థానిక మహిళ క్షేమంగా పోలీసులకు అప్పగించింది. చెన్నై కు చెందిన రామస్వామి కొడుకు అరుల్ మురుగన్ బస్టాండ్ లోని ఫ్లాట్ ఫాం నంబర్ 3 దగ్గర మిస్సయ్యాడు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చారు రామస్వామి ఫ్యామిలీ. దర్శనం తర్వాత.. తిరుగు ప్రయాణం కోసం తిరుపతిలోని చెన్నై బస్ స్టాప్ దగ్గర సేదతీరారు.
అదే సమయంలో బాలుడు తప్పిపోయినట్టు గుర్తించారు. వెంటనే పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడి కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరకు బాలుడు స్థానికంగా ఓ మహిళ కంట పడడం, ఆమె పోలీసులకు అప్పగించడం చకచక జరిగిపోయాయి. బాలుడు తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు చేరుకోవడతో వారు ఊపిరి పిల్చుకున్నారు.