హైదరాబాద్లో వీకెండ్ విషాదం.. శామీర్ పేట్ చెరువుకు ఎంజాయ్ చేయనీకి పోయి..

హైదరాబాద్లో వీకెండ్ విషాదం.. శామీర్ పేట్ చెరువుకు ఎంజాయ్ చేయనీకి పోయి..

 వీకెండ్ సరదాగా ఎంజాయ్ చేద్దామని చెరువు వెళ్లారు. ఆరు మంది స్నేహితులు సండే కదా అని మద్యం తాగి ఒకరితో ఒకరు సరదాగా ఆడుకున్నారు. ఆ మత్తులో ఈత కొడదామని ముగ్గురు చెరువులోకి దిగారు. ముగ్గుట్లో ఒకరు తిరిగిరాగా.. ఇద్దరు గల్లంతైన ఘటన ఆదివారం (ఫిబ్రవరి 16) మేడ్చల్ జిల్లా శామీర్ పేట దగ్గర జరిగింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ప్రాంతం జగద్గరిగుట్ట,   నాగారం ప్రాంతానికి చెందిన ఆరుగురు యువకులు సరదాగా ఆదివారం పూట గడపడానికి  ప్రమాదవశాత్తు ఇద్దరు చెరువులో గల్లంతయ్యారు.  ఈ ఘటన మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం పొన్నాల గ్రామంలో చోటు చేసుకుంది. 

బాలు(25), సందీప్ సాగర్(27), సందీప్(26) , సాయి చందర్(25) జగద్గరిగుట్ట ప్రాంతానికి చెందిన వారు.  బాలకృష్ణ  (24), కర్ర నితీశ్ కుమార్(24) నాగారం ప్రాంతానికి చెందిన వారు.  శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పొన్నాల చిత్తారమ్మ గుడి దర్శనానికి ఉదయం 11 గంటలకు వచ్చారు. అక్కడ అమ్మవారిని దర్శించుకుని గుడి వెనకాల ఉన్న చెరువు దగ్గర వంట వండుకుని.. వెంట తెచ్చుకున్న మద్యం, కల్లు తాగి, నాన్ వెజ్ తిని సరదాగా గడిపారు. 

ALSO READ | నల్గొండ జిల్లాలోని అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్

కాసేపటికి పాలసంతుల బాలు, సందీప్ సాగర్,  ఒగ్గు బాలకృష్ణ చెరువులోకి ఈత కొట్టడానికి దిగారు.  అందులో ఒక్కరు తిరిగి రాగా మరో ఇద్దరు బాలు, సందీప్ సాగర్ చెరువులో గల్లంతు అయ్యారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం శామీర్ పేట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది,  గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎంతసేపటికి ఆచూకీ లభ్యం కాకపోవడంతో..  రాత్రి కావడంతో గాలింపు చర్యలను నిలిపివేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.