
గండిపేట్, వెలుగు: నార్సింగి పీఎస్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. అంజలిరాయ్ దాస్, సబితారాయ్ కర్మాకర్(22) దంపతులు. వీరు తమ నాలుగేండ్ల బాబుతో నార్సింగిలో ఉంటున్నారు. అంజలిరాయ్‌దాస్ గురువారం పనికి వెళ్లాడు. మధ్యాహ్నం భార్యకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. ఇంటికి వచ్చి చూడగా తలుపులు గడియ పెట్టి ఉన్నాయి. స్థానికుల సహాయంతో పగులగొట్టి చూడగా.. సబితారాయ్ ఉరేసుకొని కనిపించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు
పేర్కొన్నారు.
అమీర్‌పేట్ లో..
పంజాగుట్ట, వెలుగు: ఎస్సార్ నగర్ లో కూడా ఓ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏపీలోని నంద్యాల జిల్లా అయ్యలూరుకు చెందిన పెరుమాళ్ల శశికళ(24 ) రెండేండ్ల క్రితం నగరానికి వచ్చింది. అమీర్‌పేట్‌లో ఓ అద్దె ఇంట్లో ఉంటూ కూకట్ పల్లి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో అసిస్టెంట్అక్విజేషన్ మేనేజర్‌గా పని చేస్తోంది. ఆమెతో మధురానగర్‌లోని మరో స్మాల్‌ఫైనాన్స్ బ్యాంకులో పని చేస్తున్న రమాదేవి ఉంటోంది.
రమాదేవి గురువారం ఉదయం బ్యాంకుకు వెళ్లిపోగా, శశికళ గదిలోనే ఉంది. ఆమె స్నేహితుడు రమాదేవికి ఫోన్‌చేసి, శశికళ బాధపడుతూ తనకు ఫోన్ చేసిందని, ఒకసారి రూమ్‌కు వెళ్లి చూడాలని కోరాడు. రమాదేవి వెళ్లి, తలుపు తెరిచి చూడగా.. శశికళ ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది. ప్రేమ విఫలమై, మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసిందని ఎస్ఐ రాజు తెలిపారు.