
రామచంద్రాపురం, వెలుగు: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు యువకులను ఎస్ వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పీఎస్పరిధిలో బుధవారం రాత్రి క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లపై మాదాపూర్ ఎస్ వోటీ పోలీసులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రామచంద్రాపురం పరిధిలోని బీహెచ్ఈఎల్ గ్రౌండ్‌వద్ద గుట్టుచప్పడు కాకుండా ఐపీఎల్ బెట్టింగ్ జరుగుతుందన్న సమాచారంతో ఎస్వోటీ పోలీసులు బుధవారం రాత్రి కాపు కాశారు.
ప్లాన్ ప్రకారం అక్కడికి చేరుకున్న పోలీసులకు పటాన్‌చెరుకు చెందిన కృష్ణ (38), చిరంజీవి (29) బెట్టింగ్‌కు పాల్పడుతూ దొరికారు. వారి వద్ద నుంచి రూ.5 వేల నగదు, బెట్టింగ్‌కు ఉపయోగించిన మెబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారి బ్యాంకులో ఉన్న రూ. 2 లక్షల నగదును సీజ్ చేశారు. ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడు రంజిత్ పరారీలో ఉన్నాడని, పేకాట నిర్వహించే మరో కీలక సూత్రదారి కూడా పరారీలో ఉన్పట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు