
- తలలోనే ఉండిపోయిన కత్తి, ఆసుపత్రికి తరలింపు
- నిర్మల్ మండలం రత్నాపూర్ కాండ్లీలో ఘటన
నిర్మల్, వెలుగు: నిర్మల్ మండలం రత్నాపూర్ కాండ్లీ గ్రామంలో జరిగిన ఓ పెళ్లి బారాత్ లో ఇద్దరు యువకులు ఘర్షణ పడ్డారు. శ్రీకర్, రాజు అనే యువకుల మధ్య వాగ్వాదం జరిగింది. దీనిని మనసులో పెట్టుకున్న రాజు బైక్ పై వస్తున్న శ్రీకర్ పై కత్తితో దాడి చేశాడు.
ఈ దాడిలో శ్రీకాంత్ కు తీవ్రగాయాలయ్యాయి. బాధితుడు శ్రీకర్ తలలోనే కత్తి ఉండిపోయింది. తీవ్రగాయాల పాలైన శ్రీకర్ ను అతడి స్నేహితులు నిర్మల్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ ప్రాథమిక చికిత్స చేసి నిజామాబాద్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. దాడికి పాల్పడిన రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు.