ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
  • సంగారెడ్డి జిల్లా వావిలాలలోని చెరువు వద్ద ఘటన

జిన్నారం, వెలుగు:  ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు నీట మునిగి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. దుండిగల్ మండలం చర్చ్ గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన వల్లపు నరేశ్(26), పల్లపోలు శంకర్(22) మంగళవారం సాయంత్రం జిన్నారం మండలం వావిలాలలోని పీర్ష చెరువు వద్దకు వెళ్లారు. 

కట్టపై స్కూటీని నిలిపి.. చెరువులోకి దిగి ఈత కొడుతూ లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లి మునిగిపోయారు. పశువులను మేపే వ్యక్తి చూసి వారిని కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఘటన స్థలానికి వెళ్లి గజఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం డెడ్ బాడీలను బయటకు తీసుకొచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగలక్ష్మి తెలిపారు.