ఆటో బైక్​ ఢీకొని ఇద్దరు యువకులు మృతి

జోగిపేట, వెలుగు :  మెదక్​ జిల్లా అందోల్​ మండలం బ్రహ్మణపల్లి చౌరస్తా వద్ద శనివారం ఆటో బైక్​ ఢీకొని ఇద్దరు యువకులు చనిపోయారు. జోగిపేట ఎస్ఐ సామ్య నాయక్  తెలిపిన వివరాల ప్రకారం..  అందోల్‌ కు  చెందిన గాండ్ల రాములు (29), డాకూర్‌ గ్రామానికి  చెందిన చింతకి నాగరాజు (24) బైక్​పై తాలెల్మలోని ఓ ఫంక్షన్‌కు వెళ్లి జోగిపేట వైపు వస్తుండగా ఎదురుగా వస్తున్న టాటా ఏస్​ వాహనం ఢీకొట్టింది.  దీంతో రాములు, నాగరాజు  అక్కడికక్కడే చనిపోయారు. ఆటో డ్రైవర్‌ అతివేగంగా నడపడం వల్లనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.