10 క్వింటాళ్ల పల్లీల దొంగలు అరెస్ట్

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ పట్టణంలోని ఓ గోదాంలో నిల్వ ఉంచిన 10 క్వింటాళ్ల పల్లీలను దొంగిలించిన నిందితులను టూటౌన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈమేరకు సీఐ అశోక్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ALSO Read : పదవులకే వీడ్కోలు.. సేవకు కాదు : మంత్రి పొన్నం
 

గత నెలలో స్థానిక శ్రీనాథ్ జిన్నింగ్ మిల్లులో పల్లీలతో పాటు రెండు మోటర్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి గురువారం జిల్లా కేంద్రంలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితులు సయ్యద్ జావిద్, షేక్ జావిద్, ఇర్ఫాన్​ను అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరి నుంచి 3 క్వింటాళ్ల పల్లీలు, రెండు మోటర్ పంపులు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.