టైప్ 1 డయాబెటిస్ అనేది కేవలం పెద్దల్నే కాదు పిల్లలపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తిలో వచ్చే హెచ్చు తగ్గులే దీనికి ప్రధాన కారణం. ఇది శరీరానికి శక్తి కోసం గ్లూకోజ్‌ను ఉపయోగించడంలో సహాయపడే హార్మోన్. ఇన్సులిన్ లేకుండా, గ్లూకోజ్ కూడా రక్తప్రవాహంలో పేరుకుపోతుంది. ఇది తీవ్రమైన లక్షణాలను కలిగిస్తుంది. అందుకే టైప్ 1 మధుమేహం ప్రారంభ లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ముఖ్యంగా పిల్లల్లో వీలైనంత త్వరగా వీటిని గుర్తించాలి.
IANS నివేదికల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పిల్లల రక్షణ కోసం జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) ఇచ్చిన సూచనలను అమలు చేయాలని నిర్ణయించింది. అవసరమైన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. డయాబెటిక్ పిల్లలను పాఠశాలకు ఇన్సులిన్, గ్లూకోమీటర్ తీసుకువెళ్లడానికి కూడా అనుమతించింది.
పిల్లలలో టైప్ 1 మధుమేహం సాధారణ ప్రారంభ లక్షణాలను గమనిస్తే.. వారికి దాహం వేయడం, అధిక మూత్రవిసర్జన గమనించవచ్చు. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో గ్లూకోజ్ మూత్రంలో విసర్జించబడుతుంది. ఇది క్రమంగా చిన్నారి నిర్జలీకరణానికి కారణమవుతుంది. వారి శరీరంలోని గ్లూకోజ్ పోవడంతో వారికి ఆకలి పెరగవచ్చు. దీని వల్ల వారు ఎక్కువ తినే అవకాశం కూడా ఉంటుంది. పిల్లలలో టైప్ 1 మధుమేహం ఇతర సంకేతాలను పరిశీలిస్తే బరువు తగ్గడం, అలసట, చిరాకు, చూపు మందగించడం కూడా ఉండవచ్చు.
ALSO READ :ఉప్పొంగిన మున్నేరు.. : తెలంగాణ – ఏపీ మధ్య రాకపోకలు బంద్
మీ పిల్లలలోనూ ఈ సంకేతాలు, లక్షణాలను గమనించినట్లయితే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. రక్తంలో అధిక చక్కెర స్థాయిలను చెక్ చేసేందుకు రక్త పరీక్ష చేయించాలి. ఇది మధుమేహానికి ముఖ్య సూచన. చిన్నారికి టైప్ 1 మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ అయినట్లయితే, వారి పరిస్థితిని నిర్వహించడానికి, సహాయపడడానికి కూడా అనేక మార్గాలు ఉన్నాయి.
ముఖ్యంగా మధుమేహం బారిన పడిన చిన్నారుల భోజనం ప్రణాళిక, శారీరక శ్రమ, అవసరమైతే మందులు లేదా ఇన్సులిన్ వాడకం గురించిన దానిపై సమాచారం కలిగి ఉండాలి. వారి రక్తంలో చక్కెర స్థాయిలను, మొత్తం ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి డాక్టర్‌తో క్రమం తప్పకుండా చెకప్ లు చేయించాలి. టైప్ 1 మధుమేహం అంటే ఏమిటో, దాన్ని స్వంతంగా ఎలా నియంత్రించాలో పిల్లలకు అర్థం అయ్యేలా చెప్పడం కూడా చాలా ముఖ్యం. దీని వల్ల వారు పెద్దయ్యాక తమంతట తాముగా దీన్ని నియంత్రించుకోగలుగుతారు.
చివరగా పిల్లలు టైప్ 1 డయాబెటిస్‌ను ఎదుర్కోవడానికి జీవనశైలిలో అవసరమైన మార్పులు చేయడం కూడా చాలా కష్టం. వీటిని సర్దుబాటు చేయడం కాస్త కష్టంగా ఉంటుంది. కానీ ఇలా చేయడం వల్ల వారికి ఆ వ్యాధి తీవ్రతను పెద్దగా భావించరు. తాము ఒంటరి కాదని, తమకు మీరున్నారనే సపోర్టును కలిగించడం ఈ పరిస్థితుల్లో చాలా ముఖ్యం.