
ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు కచ్చితమైన భౌగోళిక ప్రదేశాన్ని, స్థానాన్ని భూమిపై, నీటిలో, గాలిలో తెలుసుకోవడానికి ఉపయోగించే ఉపగ్రహాలను నావిగేషన్ ఉపగ్రహాలు అంటారు.
నావిక్
ఇది భారత సొంత దిక్సూచి వ్యవస్థ. ఇదిభారత్మొత్తాన్ని, భారత సరిహద్దు నుంచి 1500కి.మీ.ల వరకు నావిగేట్ చేస్తుంది.
ఈ వ్యవస్థకు నావిక్ అని నరేంద్ర మోదీ నామకరణం చేశారు.
ఇలాంటి దిక్సూచి వ్యవస్థను సొంతంగా కలిగిన దేశాల జాబితాలో భారత్ ఆరో స్థానంలో ఉన్నది. మిగతా దేశాలు అమెరికా, ఈయూ, చైనా, రష్యా, జపాన్.
ఈ వ్యవస్థలో ఇప్పటివరకు మొత్తం 10 ఉపగ్రహాలను పంపారు. వీటిలో ఎనిమిది పనిచేస్తున్నాయి. ఏడు ఉపగ్రహాల నియంత్రణలను చేపట్టే సంస్థ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ. ఈ వ్యవస్థ రెండు రకాల సేవలను అందిస్తుంది. అవి..
- స్టాండర్డ్ పోజిషనింగ్ సర్వీస్(ఎస్పీఎస్): వినియోగదారులందరికి అందించే సేవలు.
- రిస్ట్రిక్టెడ్సర్వీస్(ఆర్ఎస్): కేవలం అధీకృత వినియోగదారులకు మాత్రమే అందించే సేవలు.
అన్ని ఉపగ్రహాల్లో రుబీడియం అణు గడియారాలు ఉంటాయి. వీటిలో ఉన్న రేంజింగ్ పేలోడ్ భూమిపై దిశానిర్దేశం అందించగల ప్రాంత పరిధిని నిర్ధారిస్తుంది.ఈ నావిగేషన్ వ్యవస్థ ఖర్చు రూ.1420 కోట్లు.దీని గ్రౌండ్ రిసీవింగ్ స్టేషన్– ఐడీఎస్ఎన్, బ్యాలాలు(బెంగళూరు సమీపంలో).
ఉపయోగాలు
- ఇది భూతల, వాయు, జలమార్గాల్లో కచ్చితత్వంతో మార్గనిర్దేశితం చేస్తుంది.
- పట్టణ ప్రణాళిక, మ్యాపింగ్, సర్వేయింగ్కు అవసరమైన సమాచారం అందజేస్తుంది.
- వాతావరణ అధ్యయనం, విపత్తు నిర్వహణ, భూఫలకల కదలికలను అర్థం చేసుకోవచ్చు.
- భారత వ్యవసాయ రంగంలో కీలకపాత్ర పోషించనున్న ప్రిసిషన్ ఫార్మింగ్‌కు ఉపయోగపడుతుంది.
- వాహనాల గమనాన్ని(విమానాలతో సహా) ఎప్పటికప్పుడు పరిశీలించడం వల్ల వాహన రద్దీ నిర్వహణ సులభమవుతుంది.
- భవిష్యత్తులో ప్రవేశపెట్టే నావిగేషనల్ శాటిలైట్ అయిన ఎన్వీఎస్–01 నుంచి ఎల్–1 ఫ్రీక్వెన్సీని ప్రవేశపెట్టనున్నారు. ఫలితంగా నావిగేషన్ వ్యవస్థ సమర్థతను పెంచడం వల్ల పౌర సేవలను బలోపేతం చేయవచ్చు. ప్రస్తుతం మన ఐఆర్ఎన్ఎస్ఎస్ వ్యవస్థలో ఎల్–5, ఎస్ బ్యాండ్స్
- ఉపయోగిస్తున్నాం.