చైనాను వణికిస్తున్న బెబింకా టైఫూన్‌‌

చైనాను వణికిస్తున్న బెబింకా టైఫూన్‌‌

బీజింగ్‌‌: చైనాను బెబింకా టైఫూన్‌‌ వణికిస్తోంది. సోమవారం ఈ టైఫూన్‌‌ దేశ ఆర్థిక నగరమైన షాంఘైను తాకింది. దీంతో సిటీలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రజా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. విద్యాసంస్థలు, పలు ప్రైవేటు ఆఫీసులను, పార్కులను, ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌ ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశారు. 1949 తర్వాత షాంఘైను తాకిన భారీ తుపాన్‌‌ ఇదేనని అధికారులు వెల్లడించారు. 

ఈ టైఫూన్‌‌ ప్రభావంతో పలు విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. షాంఘైలో ఉన్న రెండు ఎయిర్‌‌‌‌పోర్టుల నుంచి పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. 4.14 లక్షల మందిని షాంఘై నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. టైఫూన్‌‌ దాటికి ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. 2,500కు పైగా ఎమర్జెన్సీ టీమ్‌‌లను రెడీ చేసింది. 56 వేల మంది రెస్క్యూ సిబ్బందిని సిద్ధం చేసింది.