![వియత్నాంలో తుపాను..155 మంది మృతి](https://static.v6velugu.com/uploads/2024/09/typhoon-in-vietnam-155-people-died_nHeBQqUoGs.jpg)
- 141 మంది గల్లంతు
హనోయి: వియత్నాంలో యాగీ తుపానుతో సంభవించిన వరదలకు లావో కై ప్రావిన్స్‌లోని లాంగ్‌ను అనే గ్రామం పూర్తిగా నీటమునిగింది. గ్రామంలోని 35 కుటుంబాలు వరదల్లో చిక్కుకుపోవడంతో 30 మంది మరణించారు.
తాజా ఘటనతో యాగీ తుపాను వల్ల వియత్నాంలో మరణించిన వారి సంఖ్య 155కు పెరిగిందని స్థానిక మీడియా బుధవారం వెల్లడించింది. మరో 141 మంది గల్లంతయ్యారని..వందలాది మంది గాయపడ్డారని తెలిపింది.
భారీ వరదలకు తోడు కొండచరియలు విరిగిపడుతుండటమే ఇన్ని మరణాలకు కారణమని వివరించింది.