వియత్నాంలో తుపాను విలయతాండవం.. 87 మంది మృతి

వియత్నాంలో తుపాను విలయతాండవం.. 87 మంది మృతి

హనోయి: వియత్నాంలో యాగీ తుపానుతో సంభవించిన వరదలకు చనిపోయినవారి సంఖ్య 87కు చేరుకుంది. మరో 70 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వందలాది మంది గాయపడ్డారు. వరదలు బీభత్సంతోపాటు కొండచరియలు విరిగిపడటం వల్లే అత్యధిక మరణాలు సంభవించాయని స్థానిక మీడియా మంగళవారం వెల్లడించింది. వియత్నాం రాజధాని హనోయి గుండా ప్రవహించే రెడ్ రివర్‎తో సహా పలు నదుల్లో నీటి మట్టాలు ప్రమాదకరంగా ఉన్నాయని తెలిపింది. నదీ పరివాహక ప్రాంతాల్లో  నివసిస్తున్న కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించారని వివరించింది. అందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొంది.