U17 World Championships: సెమీ ఫైనల్లో రోనక్‌‌‌‌‌‌‌‌

U17 World Championships: సెమీ ఫైనల్లో రోనక్‌‌‌‌‌‌‌‌
  • అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌17 వరల్డ్ రెజ్లింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌

అమన్ (జోర్డాన్‌‌‌‌‌‌‌‌): ఇండియా యంగ్ రెజ్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోనక్ దహియా అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌17 వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో స్వర్ణ పతకానికి చేరువయ్యాడు. ఈ టోర్నీలో మన దేశం నుంచి పోటీ పడుతున్న ఏకైక గ్రీకో రోమన్ రెజ్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన రోనక్ 110 కేజీ విభాగంలో సెమీఫైనల్‌‌‌‌‌‌‌‌కు దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన  క్వార్టర్ ఫైనల్లో అతను టెక్నికల్ సుపీరియారిటీతో డానిల్‌‌‌‌‌‌‌‌ మస్లాకొను చిత్తు చేశాడు. అంతకుముందు 8–1తో అర్టుర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మన్వేలియను ఓడించాడు. సెమీస్‌‌‌‌‌‌‌‌లో అతను హంగేరికి చెందిన జోల్టన్ జకోతో పోటీపడనున్నాడు.