U19 Asia Cup 2023: బంతితో మాయచేసిన యువ బౌలర్.. సెమీస్ చేరిన టీమిండియా

U19 Asia Cup 2023: బంతితో మాయచేసిన యువ బౌలర్.. సెమీస్ చేరిన టీమిండియా

యువ ఆటగాళ్లు తలపడే అండర్-19 ఆసియా కప్ 2023 టోర్నీలో భారత యువ జట్టు అద్భుతం చేసింది. మంగళవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత రాజ్ లింబానీ(7 వికెట్లు) విజృంభించడంతో నేపాల్ బ్యాటర్లు 52 పరుగులకే కుప్పకూలారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత బ్యాటర్లు 7.1 ఓవర్లలోనే చేధించారు. ఈ విజయంతో టీమిండియా సెమీఫైనల్ బెర్త్ దాదాపు ఖాయం అయ్యింది. 

రాజ్ లింబానీ 

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన నేపాల్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూనే వచ్చింది. రాజ్ లింబానీ దెబ్బకు ఏ ఒక్క బ్యాటరూ రెండెంకెల స్కోర్ చేయలేకపోయారు. నేపాల్ ఇన్నింగ్స్‍లో భారత బౌలర్లు ఇచ్చిన 13 పరుగులే అత్యధిక స్కోరు. మొత్తంగా 9.3 ఓవర్లు వేసిన లింబానీ 13 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అందులో 3 మెయిడిన్ ఓవర్లు ఉన్నాయి. ఇచ్చిన 13 పరుగుల్లో 2 వైడ్‌ల రూపంలో వచ్చినవే.

7.1 ఓవర్లలోనే

అనంతరం 53 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత బ్యాటర్లు వికెట్ నష్టపోకుండా 7.1 ఓవర్లలోనే చేధించారు. ఈ విజయంతో టీమిండియా సెమీఫైనల్ బెర్త్ దాదాపు ఖాయం అయ్యింది. ఈ టోర్నీలో టీమిండియాకు అది రెండో విజయం. తొలి మ్యాచ్‌లో అఫ్ఘనిస్తాన్‌ను మట్టికరిపించిన భారత యువ జట్టు.. రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలైంది.