సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యంగ్ ఇండియా..సూపర్ సిక్స్‌‌‌‌‌‌‌‌లో 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌పై ఘన విజయం

సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యంగ్ ఇండియా..సూపర్ సిక్స్‌‌‌‌‌‌‌‌లో 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌పై ఘన విజయం
  • రాణించిన త్రిష, వైష్ణవి

కౌలాలంపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : డిఫెండింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా  అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌19 విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  మరో టైటిల్ దిశగా దూసుకెళ్తోంది. లీగ్ దశలో  హ్యాట్రిక్ విక్టరీల జోరును కొనసాగించిన అమ్మాయిలు సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నూ అదిరిపోయే విజయంతో సెమీఫైనల్లో అడుగు పెట్టారు. శనివారం జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–1 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేశారు. ఫలితంగా టోర్నీలో వరుసగా  నాలుగో గెలుపు ఖాతాలో వేసుకొని నాకౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరుకున్నారు.. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో తొలుత ఇండియా బౌలింగ్ ధాటికి బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 64/8 స్కోరు మాత్రమే చేసింది. 

కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సుమియా అక్తర్ (21 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌),. జనాతుల్ మౌవా (14) తప్ప మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే పరిమితం అయ్యారు. ఇండియా బౌలర్లలో స్పిన్నర్ వైష్ణవి శర్మ (3/15) మూడు వికెట్లతో సత్తా చాటగా.. షబ్నమ్ షకీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జోషితా, హైదరాబాదీ గొంగడి త్రిష తలో వికెట్ తీశారు. అనంతరం ఓపెనర్ గొంగడి త్రిష (31 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8 ఫోర్లతో 40) మెరుపు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇండియా 7.1 ఓవర్లలోనే 66/2 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. వైష్ణవికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డు దక్కింది. మంగళవారం జరిగే తమ చివరి సూపర్ సిక్స్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్కాట్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇండియా పోటీ పడనుంది.