విమెన్స్‌‌‌‌ అండర్‌‌‌‌–19 ఆసియా కప్‌‌‌‌లో..రాణించిన త్రిష

విమెన్స్‌‌‌‌ అండర్‌‌‌‌–19 ఆసియా కప్‌‌‌‌లో..రాణించిన త్రిష

కౌలాలంపూర్‌‌‌‌ : ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో ఆకట్టుకున్న ఇండియా జట్టు.. విమెన్స్‌‌‌‌ అండర్‌‌‌‌–19 ఆసియా కప్‌‌‌‌లో మూడో విజయాన్ని అందుకుంది. టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో తెలుగు బ్యాటర్‌‌‌‌ గొంగడి త్రిష (46 బాల్స్‌‌‌‌లో 10 ఫోర్లతో 58 నాటౌట్‌‌‌‌) దంచికొట్టడంతో గురువారం జరిగిన సూపర్‌‌‌‌–4 మ్యాచ్‌‌‌‌లో ఇండియా 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌‌‌‌పై గెలిచింది. టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన బంగ్లాదేశ్‌‌‌‌ 20 ఓవర్లలో 80/8 స్కోరు చేసింది.

మోసమ్మత్‌‌‌‌ ఇవా (14) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. తర్వాత ఇండియా 12.1 ఓవర్లలో 86/2 స్కోరు చేసి నెగ్గింది. ఇండియా 22 రన్స్‌‌‌‌కే 2 వికెట్లు కోల్పోయి ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో ఫోర్లతో రెచ్చిపోయిన త్రిషకు అండగా నిలిచిన నిక్కి ప్రసాద్‌‌‌‌ (22 నాటౌట్‌‌‌‌) ఈజీగా విజయాన్ని అందించింది. త్రిషకు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.