దుబాయ్: డిఫెండింగ్ చాంపియన్ ఇండియా రెండో ఎడిషన్ విమెన్స్ అండర్19 టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు మలేసియాలో జరిగే ఈ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ ఆదివారం విడుదల చేసింది. ఇండియా ఆతిథ్య మలేసియా, వెస్టిండీస్, శ్రీలంకతో కూడిన గ్రూప్–ఎలో చోటు దక్కించుకుంది.
గ్రూప్–బిలో ఇంగ్లండ్, ఐర్లాండ్, పాకిస్తాన్, యూఏఈ పోటీ పడనున్నాయి. సౌతాఫ్రికా, న్యూజిలాండ్, కొత్త జట్టు సమోవా, ఆఫ్రికా నుంచి వచ్చే క్వాలిఫయర్ గ్రూప్–సిలో బరిలో ఉండగా, గ్రూప్–డిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, ఆసియా క్వాలిఫయర్ పోటీలో ఉంటాయి. ప్రతీ గ్రూప్‌లో టాప్3 జట్లు సూపర్ సిక్స్ దశకు అర్హత సాధించాయి. సూపర్ సిక్స్ దశలో 12 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. రెండు గ్రూపుల్లోని టాప్2 జట్లు సెమీస్‌కు క్వాలిఫై అవుతాయి. జనవరి 31న సెమీఫైనల్స్, ఫిబ్రవరి 2న ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి.
Tournament format for the ICC U19 Women's T20 World Cup 2025 explained 📜#U19WorldCup | Fixtures ➡️ https://t.co/N5xqg2mCPZ pic.twitter.com/q8WsEzYrPa
— ICC (@ICC) August 18, 2024