
కౌలాలంపూర్: అండర్–19 విమెన్స్ టీ20 వరల్డ్ కప్ వామప్ లో ఇండియా సత్తా చాటింది. సోమవారం జరిగిన వామప్ పోరులో 119 రన్స్ తేడాతో స్కాట్లాండ్‌పై ఘన విజయం సాధించింది. తొలుత ఇండియా 20 ఓవర్లలో 164/7 స్కోరు చేసింది. కమలిని (32), హైదరాబాదీ జి. త్రిష (26) రాణించారు. అనంతరం ఛేజింగ్‌లో ఆ జట్టు 18.5 ఓవర్లలో 45 రన్స్‌కే ఆలౌటైంది. షబ్నమ్ షకీల్, వైష్ణవి శర్మ, సోనమ్ యాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. మెగా టోర్నీ శనివారం మొదలవనుండగా.. డిఫెండింగ్ చాంపియన్ ఇండియా ఆదివారం జరిగే తమ తొలి పోరులో వెస్టిండీస్‌తో పోటీపడనుంది.