
అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం(జనవరి 31) ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించి.. ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 113 పరుగులు చేయగా.. స్వల్ప లక్ష్యాన్ని భారత మహిళలు వికెట్ నష్టపోయి.. 15 ఓవర్లలోనే చేధించారు.
కమలిని హాఫ్ సెంచరీ
టోర్నీ అంతటా మంచి ఫామ్ కనబరిచిన భారత ఓపెనర్లు.. సెమీస్‌లోనూ అదరగొట్టారు. ఇంగ్లండ్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించారు. కమలిని(56 నాటౌట్) చేయగా.. గొంగడి త్రిష(35) పరుగులు చేసింది. తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించారు. ధాటిగా ఆడే ప్రయత్నంలో త్రిష ఔటైనప్పటికీ.. సనికా చల్కే (11 నౌటౌట్), కమలిని జోడి మిగిలిన పనిని పూర్తి చేశారు.
ఇంగ్లండ్ హడల్
బౌలింగ్‌లోనూ మనదే పైచేయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకున్న ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు హడలెత్తించారు. ఓపెనర్ డేవినా పెరిన్ (45) కాసేపు మెరుపులు మెరిపించినా.. ఆమె ఔట్ అయ్యాక ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. భారత బౌలర్లలో పరుణికా సిసోదియా (3), వైష్ణవి శర్మ (3), ఆయుషి శుక్లా (2) వికెట్లు పడగొట్టారు.
ఆదివారం(ఫిబ్రవరి 31) భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైనల్ జరగనుంది.
? ?
— BCCI Women (@BCCIWomen) January 31, 2025
?? ????: Summing up #TeamIndia's dominating performance in the #U19WorldCup Semi-Final ? ?
Scorecard ▶️ https://t.co/rk4eoCA1B0 #INDvENG pic.twitter.com/ZOLzTy6tWF