బెనోని వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతోన్న అండర్-19 ప్రపంచ కప్ 2024 ఫైనల్ పోరు హోరాహోరీగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ధాటిగా ఆడుతుండగా.. భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచుతున్నారు. 30 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 3 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. హర్జాస్ సింగ్(20 నాటౌట్), ర్యాన్ హిక్స్(17 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. సామ్ కొంటాస్(0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. రామ్ లింబానీ ఓ చక్కని బంతితో అతన్ని బౌల్డ్ చేశాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన వీగెన్(48).. హ్యారీ డిక్సన్ (42)తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. ఈ జోడీని నామన్ తివారీ విడగొట్టాడు. వరుస ఓవర్లలో ఇద్దరిని పెవిలియన్ చేర్చాడు.
99 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ఇన్నింగ్స్‌ను హర్జాస్ సింగ్-ర్యాన్ హిక్స్ చక్కదిద్దుతున్నారు. ఓవైపు నిలకడగా ఆడుతూనే.. మరోవైపు బౌండరీలు సాధిస్తున్నారు. వీరిద్దరిని త్వరగా ఔట్ చేయాలి. లీగ్ దశలో మంచి బౌలింగ్ ప్రదర్శన చేసిన భారత యువ బౌలర్లు ఫైనల్‌లో ఆ దూకుడు చూపడం లేదు.
U19 World Cup 2024 final Naman Tiwari gets Aussie skippe Australia 3 down