- సూపర్–6లోకి ప్రవేశం
- అండర్–19 విమెన్స్ టీ20 వరల్డ్ కప్
కౌలాలంపూర్ : ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న ఇండియా.. అండర్–19 విమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్‌లో తెలుగమ్మాయి గొంగడి త్రిష (44 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 49) చెలరేగడంతో.. గురువారం జరిగిన గ్రూప్–ఎ మ్యాచ్‌లో టీమిండియా 60 రన్స్ తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. దీంతో ఆరు పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచిన ఇండియా సూపర్–6లోకి ప్రవేశించింది.
టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 118/9 స్కోరు చేసింది. తర్వాత లంక 20 ఓవర్లలో 58/9 స్కోరుకే పరిమితమైంది. రష్మిక సివాండి (15) మాత్రమే రెండంకెల స్కోరు చేసింది. త్రిషకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆదివారం జరిగే సూపర్–6 తొలి మ్యాచ్‌లో ఇండియా.. బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.
కీలక భాగస్వామ్యాలు..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు త్రిష అదిరిపోయే ఆరంభాన్నిచ్చింది. కమిలిని (5), సానికా చాల్కే (0) నిరాశపర్చడంతో ఇండియా 17/2తో కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ నిక్కీ ప్రసాద్ (11) మెరుగ్గా ఆడి మూడో వికెట్‌కు 29 రన్స్ జోడించింది. తర్వాత భావికా అహిరె (7) ఫెయిలైనా నాలుగో వికెట్‌కు 30 రన్స్ జత చేసింది.
హాఫ్ సెంచరీ ముందు త్రిష ఔటైనా.. మిడిల్‌లో మిథిలా వినోద్ (16), జోషిత (14) మెరుగ్గా ఆడారు. ఈ ఇద్దరు కలిసి ఇండియా స్కోరును వంద దాటించారు. ఆయుషి శుక్లా (5), షబ్నమ్ (2 నాటౌట్), పారునికా (1), వైష్ణవి శర్మ (1 నాటౌట్) విఫలమయ్యారు. ప్రముది, లిమాన్సా, అసేని తలా రెండు వికెట్లు తీశారు.
12 రన్స్‌కే 5 వికెట్లు..
ఛేజింగ్‌లో ఇండియా బౌలర్లు వీజే జోషిత (2/17), షబ్నమ్ (2/9) దెబ్బకు లంక టాప్ ఆర్డర్ కుదేలైంది. ఫలితంగా 3.2 ఓవర్లలో 9/4తో కష్టాల్లో పడింది. తర్వాతి ఓవర్‌లో కెప్టెన్ మనుడి ననయాక్కరా (2) కూడా వెనుదిరగడంతో స్కోరు 12/5గా మారింది. మ్యాచ్ మధ్యలో స్పిన్నర్లు రావడంతో లంకేయుల పరిస్థితి మరింత దిగజారింది. లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ పారునికా సిసోడియా (2/7), ఆయుషి శుక్లా (1/13), వైష్ణవి శర్మ (1/3) లోయర్ ఆర్డర్‌ను దెబ్బతీసింది.
ఈ ముగ్గురు బాల్‌ను అద్భుతంగా టర్న్ చేస్తూ వరుస విరామాల్లో వికెట్లు తీశారు. దీంతో ఇన్నింగ్స్ మొత్తంలో 10 మంది సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. అసేని తలగునే (9) రెండో టాప్ స్కోరర్‌గా నిలిచింది.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా : 20 ఓవర్లలో 118/9 (త్రిష 49, ప్రముది 2/10), శ్రీలంక : 20 ఓవర్లలో 58/9 (రష్మిక 15, షబ్నమ్ 2/9, పారునిక 2/7).