Women's U19 World Cup: సంచలన విజయం.. న్యూజిలాండ్‌ను చిత్తుచేసిన నైజీరియన్లు

Women's U19 World Cup: సంచలన విజయం.. న్యూజిలాండ్‌ను చిత్తుచేసిన నైజీరియన్లు

మలేషియా వేదికగా జరుగుతున్న అండర్‌-19 ప్రపంచకప్‌‌లో సంచలన విజయం నమోదయ్యింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన న్యూజిలాండ్ జట్టు నైజీరియా చేతిలో పరాజయం పాలైంది. ఇరు జట్ల మధ్య సోమవారం(జనవరి 20) జరిగిన మ్యాచ్లో నైజీరియా రెండు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.

వర్షం అంతరాయం 

వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచును 13 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన నైజీరియా మహిళలు నిర్ణీత 13 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 65 పరుగులు చేశారు. అనంతరం చేధనకు దిగిన న్యూజిలాండ్ మహిళా జట్టు నిర్ణీత ఓవర్లలో 63 పరుగులకే పరిమితమైంది. ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు అవసరం కాగా.. లిలియన్ ఉదేహా అద్భుతంగా కట్టడి చేసింది. కేవలం ఐదు పరుగులిచ్చి జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించింది.

Also Read:-ఇంగ్లాండ్‌తో టీమిండియా టీ20 సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

మ్యాచ్ జరుగుతునంతసేపు ఇరు జట్ల డగౌట్లలో టెన్షన్ వాతావరణమే. సునయాసంగా గెలవాల్సిన మ్యాచ్ ను న్యూజిలాండ్ మహిళలు చేజార్చుకోవడం వారిని బాధించినా.. నైజీరియా మహిళ పోరాటం అద్భుతం అని చెప్పుకోవాలి. తలపడుతోంది బలమైన జట్టైనా.. నిర్దేశించింది స్వల్ప లక్ష్యమైనా.. విజయం కోసం వారు పోరాడిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. అండర్ 19 ప్రపంచ కప్ చరిత్రలో నైజీరియా జట్టుకు ఇదే తొలి విజయం. దాంతో గెలుపు పూర్తి కాగానే వారి ఆనందానికి అవధులు లేవు. సంతోషంతో మైదానం అంతటా పరుగులు పెట్టారు.