అబుదాబి: యూఏఈలో డ్రైవర్ గా పని చేస్తున్న మునావర్ ఫైరూస్ అనే భారతీయ యువకుడు జాక్‌పాట్ కొట్టాడు. లక్కీ డ్రాలో రూ.45 కోట్లు గెలుచుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అతడు ఐదేండ్లుగా ప్రతి నెలా లాటరీ టికెట్లు కొనేవాడు. న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబరు 31న నిర్వహించిన బిగ్ టికెట్ లైవ్ డ్రాలో మెగా ప్రైజ్ మనీ విజేతగా నిలిచాడు. ఏకంగా 20 మిలియన్ల దిర్హామ్‌లు (రూ. 45,32,02,295) గెలుచుకున్నాడు.
రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావడంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. “విజేతగా నిలిచానంటే నాకు ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు. రూ.45 కోట్లు గెలుచుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. లాటరీ టిక్కెట్ కొనుగోలు చేసేందుకు నాకు 30 మంది ఫ్రెండ్స్ సహకరించారు. వారితో కలిసి ఈ ఫ్రైజ్ మనీ పంచుకుంటాను" అని మునావర్ పేర్కొన్నాడు.