2025 Asia Cup: ఆసియా కప్‌కు అర్హత సాధించిన UAE

2025 Asia Cup: ఆసియా కప్‌కు అర్హత సాధించిన UAE

ప్రస్తుతం 2025 ఆసియా కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్ లో భాగంగా  2025 ఆసియా కప్ ట్వంటీ20 టోర్నమెంట్‌కు యూఏఈ అర్హత సాధించింది. ఆదివారం (ఏప్రిల్ 21) అల్ అమీరత్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఒమన్ జట్టుపై 55 పరుగుల తేడాతో యూఏఈ నెగ్గింది. కెప్టెన్ మహమ్మద్ వసీం అద్భుత సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులకే పరిమితమైంది. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి ఒమన్ జట్టు లక్ష్య ఛేదనలో వెనకపడింది. 54 పరుగులకే 5 కీలక వికెట్లు చేజార్చుకొని పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఈ దశలో వికెట్ కీపర్ అథవాలా 49 పరుగులు చేసి ఆదుకునే ప్రయత్నం చేసినా లక్ష్యం ఎక్కువగా ఉండడంతో ఓటమి తప్పలేదు. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ మహ్మద్ వసీమ్ సెంచరీ (56 బంతుల్లో 100,6 ఫోర్లు, 7 సిక్సులు) చేయడంతో నిర్ణేత 20 ఓవర్లలో 204 పరుగులు చేసింది. 

also read : బుమ్రాను గుర్తు చేశాడుగా: పాక్ బౌలర్ స్టన్నింగ్ యార్కర్

"ఆసియా కప్ 2025కి అర్హత సాధించడం గొప్ప అనుభూతి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ టోర్నీ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం. మేము భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్,శ్రీలంక వంటి అగ్రశ్రేణి జట్లతో ఆడటం గొప్ప విషయం. గత రెండు సంవత్సరాలుగా మేము అర్హత సాధించలేకపోయాం. మా కుర్రాళ్ళు చాలా అద్భుతంగా రాణించారు. అని  UAE ప్రధాన కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్ ఉప్పొంగిపోయాడు.