టీ20 క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు చోటు చేసుకుంది. టీ20 క్రికెట్ వచ్చి దాదాపు 17 ఏళ్లవుతున్నా..ఇప్పటి వరకు ఇలాంటి రికార్డు ఎప్పుడు నమోదు కాలేదు. తొలిసారిగా..తాజాగా న్యూజిలాండ్, యూఏఈ జట్ల మధ్య జరిగిన జరిగిన టీ20 మ్యాచులో ఈ అరుదైన రికార్డు నమోదైంది.
ఆగస్ట్ 17 నుంచి UAE, న్యూజిలాండ్ మధ్య 3-మ్యాచ్‌ల T20 సిరీస్ మొదలైంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ 19 పరుగుల తేడాతో గెలిచింది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు టీ20 క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు ఈ మ్యాచులో నమోదైంది. ఇరు జట్లూ తమ ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్లు కోల్పోయి ఈ రికార్డును సృష్టించాయి.
అంతర్జాతీయ టీ20ల్లో ఇన్నింగ్స్ తొలి బంతికే ఇరు జట్లు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటింగ్కు దిగింది. ఈ క్రమంలో న్యూజిలాండ్ ఓపెనర్ చాడ్ బోస్ తొలి బంతికే ఔటయ్యాడు. యూఏఈ బౌలర్ జునైద్ సిద్ధిఖీ ఈ వికెట్ తీశాడు.
A wicket off the 1st ball in the 1st ever T20 between UAE and New Zealand.
— FanCode (@FanCode) August 17, 2023
.
.#UAEvNZ pic.twitter.com/5YmoWcLP6F
అదే సమయంలో బ్యాటింగ్కు దిగిన యూఏఈ ఓపెనర్ మహ్మద్ వసీమ్ను కివీస్ కెప్టెన్ టిమ్ సౌథీ తొలి బంతికే పెవీలియన్ చేర్చాడు.
And now, New Zealand get a wicket on their first ball! Both teams get wickets in the innings' first delivery! Could well be a T20I record?
— FanCode (@FanCode) August 17, 2023
.
.#UAEvNZ pic.twitter.com/NGRRo7fnaS
మ్యాచ్లో న్యూజిలాండ్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్..20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఆ తర్వాత 156 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన యూఏఈ 19.4 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌట్ అయింది. కివీస్ కెప్టెన్ టిమ్ సౌథీ 5 వికెట్లు పడగొట్టాడు.