Uber Auto: ఉబర్‌ కొత్త రూల్స్.. ఇకపై ఆటో రైడ్లకు ఓన్లీ క్యాష్‌ పేమెంట్

Uber Auto: ఉబర్‌ కొత్త రూల్స్.. ఇకపై ఆటో రైడ్లకు ఓన్లీ క్యాష్‌ పేమెంట్

క్యాబ్‌ అగ్రిగేటర్‌ ఉబర్‌(Uber) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉబర్‌ సేవల్లో ఆటో బుక్‌ చేసుకున్న ప్రయాణికులు క్యాష్‌ రూపంలో డ్రైవర్‌కు చెల్లింపులు చేయాలని స్పష్టం చేసింది. మున్ముందు ప్రయాణికులు, ఆటో డ్రైవర్‌ మధ్య జరిగే లావాదేవీలపై సంస్థ జోక్యం చేసుకోదని ప్రకటించింది. ఈ రూల్ ఫిబ్రవరి 18 నుంచి అమల్లోకి వచ్చింది. 

నో కమీషన్..

ఆటో రైడ్లపై కమీషన్‌ కూడా వసూలు చేయబోమని ఉబర్‌ పేర్కొంది. అలాగే, క్యాన్సిలేషన్‌ ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది. అంతేకాదు రైడ్‌ బుకింగ్‌ సమయంలో చూపించే ఫేర్‌(ధర) ఫైనల్‌ కాదని.. డ్రైవర్‌, ప్రయాణికులు మాట్లాడుకొని ఆ మొత్తాన్ని పెంచుకోవడమో.. తగ్గించుకోవడమో చేయొచ్చని సూచించింది.

ప్రయాణికురాలికి వాట్సప్ మెసేజులు

వారం రోజుల క్రితం కేరళకు చెందిన ఒక మహిళకు ఉబెర్ డ్రైవర్.. వాట్సాప్ సందేశాలు పంపాడు. ప్రయాణికులు కారులో ఎక్కిన సమయంలో వచ్చిన స్ప్రే స్మెల్ బాగుందని.. దాని పేరేంటో చెప్పాలని కోరాడు. డ్రైవర్‌తో జరిగిన సంభాషణను సదరు బాధితురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఉబర్ సంస్థ డ్రైవర్ల తీరును ఎండగట్టింది. ఈ క్రమంలోనే ఉబర్ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చన్న టాక్ నడుస్తోంది. ఓన్లీ క్యాష్‌ పేమెంట్‌ అయితే.. డ్రైవర్లకు నెంబర్ ఇవ్వాల్సిన అవసరం సంస్థ అభిప్రాయం.